ఆహారంప్రాంతీయంరాజకీయం

చంద్రబాబుపై హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు స‌రికావు- మాజీ మంత్రి అయ్యన్న.

న‌ర్సీప‌ట్నం: హోంమంత్రి మేకతోటి సుచరిత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. సుచరిత అసలు మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మీకు గుర్తుందా. మీరు ఒక బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారు.అసలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకుందా. రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండు ఉంటాయి. ఈ రెండిటికీ సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాలి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా దేశంలో గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు, కేంద్రంలో కూడా అభినందనలు పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. విమర్శించడం తప్పు అనట్లేదు రాజకీయాల్లో సహజం. కానీ విమర్శలు మితిమీరకూడదు, మీరే కాదు మీతోటి మంత్రులు ప్రెస్ లో కూడా బూతులు తిట్టే పరిస్థితి ఉంది. ఫోన్ టాపింగ్ గురించి చంద్రబాబునాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తే నీకు ఎందుకు బాధ, మీ నాయకులు ఎందుకు భుజాలు తడుముకున్నారు. గతంలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ ఇష్యు ఇలాగే జరిగితే ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి వచ్చింది. అది దృష్టి లో పెట్టుకొని చంద్రబాబునాయుడు గారు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో దళితులపై ఎన్ని అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎప్పుడు స్పందించని మీరు, కేంద్రానికి ఒక్క లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తారా.ఈస్ట్ గోదావరి లో ప్రసాధ్ అనే కుర్రవాడికి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.కరోనా పై పోరాడిన డాక్టర్లకు మాస్కులు లెవన్నందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడనే ముద్ర వేసేందుక ప్రయత్నించారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మాస్కు పెట్టుకో లేదన్న కారణంతో చీరాల కు చెందిన దళిత యువకుడైన కిరణ్ ను లాఠీలతో కుళ్ళ పొడిచి చంపారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. చిత్తూరు ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందుకు అనిత రాణి గారిని అవమానించారు, ఆమె బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి క్షోభకు గురి చేశారు, ఒక మహిళగా అప్పుడు ఎందుకు స్పందించలేదు. గుంటూరు రామి రెడ్డి నగర్ లో ఐదు సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన లక్ష్మణ్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఇంత మంది దళిత లకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని మీరు, ఇప్పుడు చంద్రబాబు గారిపై ఎలా మాట్లాడుతున్నారు. అసలు దిశ చట్టం మన రాష్ట్రంలో ఉందా ?, లేదా ? ఒకవేళ ఉంటే , అసలు మన రాష్ట్రంలో దిశ చట్టం అమలు అయిందా, లేదా. అమలు కాకపోతే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఎలా ఓపెన్ చేస్తారు. అంతేకాకుండా స్వతంత్ర దినోత్సవం రోజు వేదికపై దిశ చట్టం గురించి మన ముఖ్యమంత్రి అమలు చేయకుండానే చాలా గొప్పగా చెబుతున్నారు. నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది, ప్రభుత్వ స్కూల్ల స్థలాలలో, ప్రభుత్వ కాలేజీ స్థలాల్లో, యూనివర్సిటీ స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే భావి తరాలకు ఉపయోగపడే స్థలాలను ఇలా ఇళ్ల పట్టాలకు కేటాయించడం మంచి పద్ధతి కాదు. అంతేకాకుండా ఇళ్ల స్థలాల భూ సేకరణ పేరుతో వైసీపీ పార్టీ నాయకులు కొంత మంది అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వైసీపీ నాయకులపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రమంతా ఒక పక్క కరోనా తో బాధ పడుతుంటే, మరోపక్క రాష్ట్రం అప్పుల్లో ఉంటే.జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఈ 4 ప్రాంతాల్లో, ఒక్కో ప్రాంతంలో 30 ఎకరాల చొప్పున వి.ఐ.పి గెస్ట్ హౌస్ లు కడుతున్నారు. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే తినడానికి తిండి లేకపోయినా, మీసానికి సంపంగి నూనె అన్నట్లు ఉంది. ఆ డబ్బుతో ఉపయోగపడే రిజర్వాయర్లు కట్టొచ్చుకదా, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కదా ఇప్పటికైనా జగన్ రెడ్డి ఆర్భాటాలకు పోకుండా రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతున్నాను.