Uncategorized

వెంకటగిరిలో కౌన్సిలర్ల పరిచయం

నెల్లూరు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేస్తున్న డాక్టర్ ఎం. గురుమూర్తి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శంఖారావ సభలకు విచ్చేసిన రాష్ట్ర ప్రముఖులకు మున్సిపల్ కౌన్సిలర్లను పరిచయం చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ మద్దిల గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, కలువాయి మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ శంఖారావ సభలకు విచ్చేసిన టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలవతు నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తిని ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి మున్సిపాలిటీ నుండి 25 వార్డులకు 25 వార్డులలో విజయ ఢంకా మోగించిన కౌన్సిలర్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు అందరూ వచ్చిన ప్రముఖులకు శాలువాలు, పూలదండలు, బొకేలతో సన్మానించి స్వాగతం పలికారు.