‘ఎన్నిల‌కు జగన్ భ‌య‌ప‌డేది లేదు’

ఒంగోలు, జనవరి 21 (న్యూస్‌టైమ్): ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గ‌తంలో సింగిల్‌గా ఉన్న‌ప్పుడే ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డ‌లేద‌ని మంత్రి పినిపే విశ్వ‌రూప్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టుకి వెళ్తామని మంత్రి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా వైయ‌స్ఆర్‌సీపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని మంత్రి విశ్వ‌రూప్ ధీమా వ్య‌క్తం చేశారు.

Latest News