ఆంధ్రప్రదేశ్

జయమ్మ స‌మాధి వ‌ద్ద ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

కడప, జనవరి 25 (న్యూస్‌టైమ్): దివంగత వైయ‌స్‌ రాజారెడ్డి సతీమణి వైయ‌స్‌ జయమ్మ 15వ వర్ధంతిని సోమవారం పులివెందులలో నిర్వహించారు. వైయ‌స్‌ జయమ్మ సమాధి వద్ద ప్ర‌త్యేక‌ ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్‌లోని విగ్రహం వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌, పలువురు వైయ‌స్‌ కుటుంబ సభ్యులు నివాళుల‌ర్పించారు.

అనంత‌రం ఇడుపుల‌పాయ‌లోని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్ వ‌ద్ద వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి వైయ‌స్ విజ‌య‌మ్మ నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్‌ కుటుంబ సభ్యులు సుధీక‌ర్‌రెడ్డి, సునిత‌, మ‌నోహార్‌రెడ్డి, కొండారెడ్డిలతోపాటు పలువురు వైయ‌స్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.