జాతీయం

కింగ్‌డ‌మ్ ఆఫ్ బెహ్రైన్ స‌భ్యుల‌తో జేడబ్ల్యూజీ తొలి భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): పునార‌వృత్త ఇంధ‌న క్షేత్రంలో భార‌త్‌, కింగ్‌డ‌మ్ ఆఫ్ బెహ్రైన్ స‌భ్యుల‌తో కూడిన‌ జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ తొలి స‌మావేశం దృశ్య మాధ్య‌మం ద్వారా జ‌రిగింది. పున‌రావృత్త ఇంధ‌న అథారిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అబ్దుల్ హుస్సేన్ బిన్ ఆలీ మీర్జా, బ్ర‌హైన్ బృందానికి నాయ‌క‌త్వం వ‌హించారు. భార‌త బృందానికి నూత‌న‌, పునార‌వృత్త ఇంధ‌న మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి దినేష ద‌యానంద జ‌గ్ద‌లే నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ స‌మావేశంలో కింగ్డ‌మ్ ఆఫ్ బ‌హ్రైన్‌కు భార‌తీయ రాయ‌బారి అయిన ఎస్‌హెచ్‌. పీయూష్ శ్రీ‌వాస్త‌వ కూడా పాల్గొన్నారు.

పున‌రావృత్త ఇంధ‌న రంగంలో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు జులై, 2018లో భార‌త్‌, బహ్రైన్‌లు అవ‌గాహ‌నా ప‌త్రంపై సంత‌కాలు చేశాయి. వాతావ‌ర‌ణ మార్పు ల‌క్ష్యాల‌ను సాధించడానికి పున‌రావృత్త ఇంధ‌న ప్రాముఖ్య‌త‌ను ఇరు వ‌ర్గాలూ నొక్కి చెపుతూ, తాము తీసుకున్న చొర‌వ‌ల‌ను, సాధించిన ప్ర‌గ‌తిని, త‌మ త‌మ ప్ర‌భుత్వాలు పెట్టుకున్న భ‌విష్య‌త్ ల‌క్ష్యాలు, ఈ రంగంలో అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను ప‌ట్టి చూపారు. ఈ స‌మావేశం ఎంతో ఉత్పాద‌కంగా ఉంది. త‌మ త‌మ అనుభ‌వాల‌ను, నైపుణ్యాల‌ను, ఉత్త‌మ ఆచ‌ర‌ణ ప‌ద్ధ‌తుల‌ను పంచుకోవాల‌ని అంగీకారానికి వ‌చ్చారు. ముఖ్యంగా సౌర‌, ప‌వ‌న‌, ప‌రిశుద్ధ‌మైన ఉద‌జ‌ని రంగాల‌లోను, ప్రైవేటు రంగంలో సంబంధిత ఏజెన్సీల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన‌ స‌హ‌కారం, సామ‌ర్ధ్య నిర్మాణంలో మ‌రింత లోతైన భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉండాల‌ని ఇరువ‌ర్గాలూ అంగీక‌రానికి వ‌చ్చాయి. స‌మావేశం సాద‌ర‌, స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో జ‌రిగింది. త‌దుప‌రి జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశాన్ని ప‌రస్ప‌రం ఆమోద‌యోగ్య‌మైన తేదీల‌లో నిర్వ‌హించాల‌ని అంగీక‌రించారు. ఈ తేదీల‌ను దౌత్య మార్గాల ద్వారా నిర్ణ‌యిస్తారు.