‘మత్తు’నిద్రలో కల్వకుర్తి ‘ఆబ్కారీ’

కల్వకుర్తి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): మామూళ్ల మత్తులో కల్వకుర్తి ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ ఉన్నతాధికారి జోగుతున్నాడా? ఈ అధికారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని నాగర్ కర్నూలు జిల్లా ఉన్నత అధికారులు, ఇక బెల్టు దుకాణాలను నియంత్రిస్తారని ఆశించడం అవివేకమే. కల్వకుర్తిలో అనధికారంగా విచ్చలవిడిగా సిట్టింగులు కొనసాగుతున్నా, నియోజకవర్గం కేంద్రంలోనే పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు పుట్టుకువస్తున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచారాలు, అనార్థాలు కాక ముందే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రాధేయ పడుతున్నా కరుణ చూపని ఉన్నతాధికారులపై కనీసం ప్రజాప్రతినిధులైనా ఓ కన్నేస్తారేమో చూడాలి.

హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, ఫోన్ ద్వారా సమాచారం అందించినా చర్యలు శూణ్యమే. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విచారణ పేరిట రంగంలోకి దిగిన నాగర్ కర్నూలు జిల్లా స్పెషల్ ఆఫీసర్ టీఎస్06యూబీ4979 వాహనంలో కల్వకుర్తికి వచ్చిన ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమవడడం గమనార్హం. ఆబ్కారీ స్పెషల్ ఆఫీసర్ కల్వకుర్తిలో అధికార పార్టీ అండదండలతో, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పవిత్రమైన గ్రంథాలయం ముందు ఉదయం 6:30 నుుంచి సాయంత్రం 11 వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని చెప్పినా పట్టించుకోకపోవడం శోచనీయం. సాయి వైన్స్, కల్వకుర్తి వైన్స్, పక్కనే ఉండే మరో మూడు బెల్టుషాపులను మహబూబ్‌నగర్ చౌరస్తాలో ఉండే బెల్టుషాపులను హైదరాబాద్ చౌరస్తాలో వైన్స్ షాప్‌లో పక్కన ఉండే బెల్టు షాపులను వదిలేసి చిన్నా చితక అమ్ముకునే 7 బెల్టు షాపులపై చర్యలు తీసుకోవడం కల్వకుర్తి పట్టణంలో చర్చనీయాంశం అయింది.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే నాగర్ కర్నూలు జిల్లా ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ అక్కడి నుండి జారుకోవడం అతనిపై పలు అనుమానాలకు దారితీస్తుంది. మందు అమ్ముతూ దొరికిన బాధితులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలని కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ మామూళ్ల మత్తులో ఉందని, అధికారంలో ఉన్న పార్టీ అండదండలతో ఉదయం 6 నుండి రాత్రి 11 వరకు మందు 30, 40 ఫుల్ బాటిల్‌లు అమ్మే వారిని విడిచి పెట్టి చిన్నాచితక అమ్ముకునే వారిపై కేసులు నమోదుచేయడం చాలా దారుణమని, మామూలు ఇచ్చేవారికి కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ అధికారులు ముందుగా సమాచారం ఇస్తున్నారని, దీంతో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని, కల్వకుర్తిలో బెల్టు షాపు నడవడానికి ప్రధాన కారణం లక్కీ వైన్స్, సాయి వైన్స్, కల్వకుర్తి బార్‌లని, ఈ షాపుల ద్వారా హోల్ సేల్ మందు అమ్ముతారని ఈ షాప్‌ల నుండే గ్రామాలకు, పల్లెలకు కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం ఇక్కడి నుండే మద్యం సరఫరా అవుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇదంతా కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలుసని, అధికారికి తెలిసిన వాళ్ళు ఇచ్చే ముడుపులకు లొంగి చర్యలు తీసుకోరని నాగర్ కర్నూల్ జిల్లా నుండి వచ్చిన ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ అలాంటి వారిపై ముందు చర్య తీసుకోవాలని, కానీ వాళ్ళు ఇచ్చే ముడుపులకు లొంగి అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా 90లు అమ్ముకొని బతికే అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నాడని కల్వకుర్తి పట్టణంలోని హోల్ సేల్ వైన్స్ షాప్‌లలో ఎమ్మార్పీ రేట్లు కన్న నలభై యాభై రూపాయలు ఎక్కువగా బెల్టు షాపులు అమ్మే వారి దగ్గర తీసుకుంటారని, కల్వకుర్తిలో 300 షాపులు నడుస్తున్నా పట్టించుకోకుండా కేవలం 8 మందిపై మాత్రమే కేసులు నమోదు చేయడం చాలా దారుణమని, ఎక్సైజ్ శాఖ ప్రజల కోసం పని చేస్తుందా? లేక డబ్బులకు పనిచేస్తుందా? అనే రీతిలో నాగర్ కర్నూల్ స్పెషల్ ఆఫీసర్ లా తీరు, కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు ఉందని, ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News