జిల్లాలున్యూస్రాజకీయంరాష్ట్రీయం

కర్నూలు జిల్లా సంఘటనకు నిరసనగా నర్సీపట్నం అసెంబ్లీ బిజెపి వర్చువల్ నిరసన.

నర్సీపట్నం: కర్నూల్ జిల్లా ఆత్మకూరులో మతం ముసుగులో బి.జె.పి కార్యకర్తలుపై దాడికి నిరసనగా కర్నూల్ S.T.B.C కాలేజ్ గ్రౌండులో శనివారం రాష్ట్ర స్థాయిలో అన్నిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్చువల్ నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నర్సీపట్నం పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంపర్క్ అభియాన్ ప్రముఖ్ శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంతిన భక్తసాయిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు.మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ హిందూ సమాజంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. దీనికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పకమానరన్నారు.అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మైనార్టీ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనేక దేవాలయాలపై దాడులు జరిగిరోజులు గడుస్తున్నా ఈరోజుకి తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెలగా జగన్నాద్,మండల అధ్యక్షులు బోలెం శివ, ఉపాధ్యక్షులు వేదుల శ్రీధర్ ,యువమోర్చా రాష్ట్ర నాయకులు అడిగర్ల సతీష్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వి,గొలుగొండ మండల అధ్యక్షులు గణేష్,ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ,గొంప సత్యనారాయణ, కుమార్,త్రినాధ్,సూరిబాబు,మోహన్,నాయుడు తదితర కార్యకర్తలు అందరూ లైవ్ కార్యక్రమంలో పాల్గొని నిరసన దీక్ష చేపట్టడం జరిగినది…