మర్రిమిట్ట ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్, జనవరి 29 (న్యూస్‌టైమ్): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మర్రిమిట్ట వద్ద శుక్రవారం లారీ ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఎర్రకుంట తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన జాటోత్‌ ప్రమీల (23), ప్రదీప్‌ (25), కల్యాణి(46), ప్రసాద్‌ (42), లక్ష్మి (38) తోపాటు డ్రైవర్‌ రాము (23) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Latest News