రాష్ట్రీయంవిశాఖపట్నంసేవాఫదం

కె.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిరుపేదలకు బట్టల పంపిణీ.

నర్సీపట్నం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ కాళ్ల నూకరాజు గారి 6వ వర్ధంతి సందర్భంగా స్థానిక గవరవీధి శ్రీకోదండ సీతారామ ఆలయం ప్రాంగణములో కె.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు,వృద్ధులకు చీరలు,బట్టలు ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ స్వర్గీయ కాళ్ళ నూకరాజు గారు ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక చైతన్యంతో తనదైన శైలిలో నిరుపేద ప్రజలకు మేలుచేయాలని ఆలోచనలు చేసే వారన్నారు. వారి ఆలోచనల స్ఫూర్తితో కె.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేశామన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కాళ్ల మహాలక్ష్మి,మల్ల రేవతి,శిలపరశెట్టి భవాని, కాళ్ల ధనలక్ష్మి, రేజేటి శ్రీనివాస్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు…