ఆహారంరాజకీయంస్థానికం

ప్రతి కౌలు రైతుకూ బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం- వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

అమరావతి : ప్రతి కౌలు రైతుకూ బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కోన్నారు. బుధ‌వారం జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశం ల‌నంత‌రం ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్‌సీ) ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌలు రైతులు, పాడి రైతులు, జాలర్లకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కన్నబాబు తెలిపారు.ఈ నెల 20 నుంచి ఆగస్టు 7 వరకు బ్యాంకు రుణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని, కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వాలని బ్యాంకరర్లను ఆదేశించామని వివరించారు.గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు.సీఎం వైఎస్‌ జగన్‌ ముందు చూపు వల్లే ఈసారి విత్తన సమస్యలు లేవని మంత్రి అన్నారు. చరిత్రలో మొదటిసారిగా పొగాకు కొనుగోళ్లను ప్రారంభించామని చెప్పారు. ఇందుకోసం రూ. 200 కోట్లు కేటాయించేందుకు సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు…