విజయవాడ :గిరిజన యువతకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ పేర్కొన్నారు.నగరంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం డ్రైవింగ్ శిక్షణకు ఎంపికైన 11 మంది గిరిజన యువకులకు శిక్షణఎంపిక ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో మచిలీపట్నం, విజయవాడలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నవని, ఎంపికైన 11మందికి హెవి వెహికల్డ్రైవింగ్ ట్రైనింగ్ 32 రోజులపాటు శిక్షణ ఇస్తారని కలెక్టర్ అన్నారు. శిక్షణ కాలంలో ఒక్కొక్క అభ్యర్థికి రూ. 5 వేల రూపాయలు స్టైపెండ్ గా అందిస్తారని కలెక్టర్ అన్నారు. హెవి వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత ఎపిఎస్ఆర్టిసి సంస్థలో డ్రైవింగ్ పోస్టులు ఖాళీలు ఏర్పడితే వారికి అవకాశం కల్పిస్తారని కలెక్టర్ అన్నారు. శిక్షణ నిమిత్తం ప్రతి అభ్యర్థికి రూ.20వేలు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధి కొరకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు.ఈ సమావేశంలో యం. రుక్మాంగదయ్య జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, శ్రీ జి. నాగేంద్ర ప్రసాద్ రీజినల్ మేనేజర్ ఎపిఎస్ఆర్టీసి కృష్ణారిజియన్, శ్రీ జాన్ సుకుమార్, డిప్యూటి సిటియంలు పాల్గొన్నారు…