ప్రాంతీయం

ఎస్పీతో కర్నూలు మేయర్ భేటీ

కర్నూలు, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): కర్నూల్ నగరపాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి, మెమెంటో బహుకరించారు. కర్నూలు నగర పాలక సంస్థ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జిల్లా ఎస్పీని రామయ్య కలిసి శాంతిభద్రతలపై ప్రధానంగా చర్చించారు.

నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అందించిన సేవల పట్ల సంతోషం వ్యక్తంచేసిన మేయర్ బి.వై. రామయ్య ఈ సందర్భంగా ఎస్పీని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి మాట్లాడుతూ నూతన మేయర్‌గా ఎన్నికైన బి.వై. రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. నగర మేయర్ బి.వై. రామయ్య సారధ్యంలో కర్నూల్ నగర పాలక సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, కర్నూలు పట్టణాభివృద్ధికి పాటుపడాలని ఎస్పీ ఫక్కిరప్ప కాంక్షించారు.