రాష్ట్రీయం

సీఎంను కలిసిన మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌

అమరావతి, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మేజర్‌ జనరల్‌ (ఏపీ, తెలంగాణ–జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌) ఆర్కే సింగ్‌ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఈ నెల 18న తిరుపతిలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవానికి హాజరుకాల్సిందిగా సీఎం వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌ వెంట రిటైర్డ్‌ కల్నల్‌ రాంబాబు ఉన్నారు.