తెలంగాణ

కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మారెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): తెలంగాణ సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి కూడా తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి తన కూతురు వివాహానికి రావలసిందిగా పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించారు.