ఆహారంజిల్లాలు

మంత్రి బొత్సకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

నర్సీపట్నం : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ నాయకులు తాళ్లపాలెం తరలి వెళ్లారు.అన్నవరం నుంచి రోడ్డు మార్గంలో కారులో ప్రయాణిస్తూ విజయనగరం వెళ్తున్నమంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్ధానిక నర్సీపట్నం నాయకులు తాళ్లపాలెంలో ఘ‌నంగా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ చెందిన నాయకులు ప్రత్యేకంగా ఇంటి పన్నులు 25శాతం తగ్గించడంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, ఎల్ శ్రీనువాస్‌, జాన్‌, నాయుడు, వైసిపి మహిళా నాయకురాలు వీర‌మాచినేని జ‌గ‌దీశ్వ‌రి, చోటి,సుబ్బ‌ల‌క్ష్మీ, శార‌దా, వైసీపీ కార్యకర్తలు పాల్గోన్నారు.