ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాజకీయంరాష్ట్రీయం

ముఖ్యమంత్రి నిర్ణయాలు అమలు చేయడంలో అశ్రద్ధ వైఖరి….

*నేటికీ పూర్తికాని నాడు నేడు మొదటి దశ పనులు…. 80 మంది విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు.

కొయ్యూరు కోస్తా టైమ్స్ ( మే – 3) : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి, నూతన విద్యా విధానాలను అమలు చేసి, 40 ఏళ్ల విద్యా విధానంలో మార్పు తేవాలన్న ముఖ్యమంత్రి ఆశయాలను కొంతమంది అధికారులు, స్థానిక ,, నియోజకవర్గ స్థాయి నాయకుల అశ్రద్ధ వైఖరి కారణంగా, ముఖ్యమంత్రి మానసిక పుత్రికగా ప్రశంసాలు పొందిన,, మనబడి నాడు నేడు,, పనులు, మండలంలో ని కొన్ని పాఠశాలలలో మధ్యంతరంగా నిలిచిపోయాయి. దళారీ వ్యవస్థకు సమర గీతం పాడుతూ, సామాజిక భాగస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసి, పేరెంట్ కమిటీ ద్వారా ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్ గా, నాడు నేడు పనులు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కమిటీ నేరుగా పనులు చేయకుండా, కాంట్రాక్టర్లను ఏర్పాటుచేసి పనులు అప్పజెప్పడంవల్ల , స్వలాభాలను ఆశించి పనులు కాంట్రాక్టర్లు మధ్యలో నిలుపుదల చేస్తున్నారు. ఇదేవిధంగా మండలంలోని మట్టం భీమవరం పంచాయతీ మఠం భీమారం గ్రామంలో, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాడు నేడు పనులు మద్యాంతరంగా నిలిచిపోయాయి. 2019 నవంబర్ 14న, మొదటి దశలో ప్రారంభించిన నిర్మాణ పనులు, మూడవ దశ కాలం సమీపిస్తున్నప్పటికీ, ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ పాఠశాలలో గిరిజన విద్యార్థిని, విద్యార్థులు, బాలికలు 35 మంది, 45 మంది బాలురు ఆశ్రమ పాఠశాలలో విద్యాభ్యాసం గావిస్తూ, వసతి గృహంలో ఉంటున్నారు. వీరికి పాఠశాలలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. కాలకృత్యాలకు, బయట ప్రాంతాలకు, బాలికలు సైతం వెళ్లక తప్పడం లేదు.లక్షల రూపాయలు వెచ్చించి, వాటర్ ట్యాంక్ నిర్మించారు, కానీ మోటర్ ఏర్పాటు చేసి, ఇంతవరకు వాటర్ సరఫరా చేయలేదు,మరుగుదొడ్లు నిర్మించి, తలుపులు, బేషన్ లు అమర్చలేదు. దీంతో వాటర్ ట్యాంకు, బాత్రూములు నిరుపయోగంగా మిగిలాయి. నాడు – నేడు పథకం మూడవ దశలో 16 వేల 700 కోట్లు వెచ్చించి 45 వేల పాఠశాలలో పనులు చేయాలని, అలాగే 3287 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మూడవ దశ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కానీ మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు కొన్ని పాఠశాలలో మొదటి దశ పనులు పూర్తి కాకపోవడం శోచనీయం. నాయకులు, వివిధ శాఖల అధికారులు, మా పంచాయతీపై చిరుకన్ను వేశారని, ఈ మధ్యకాలంలో వైయస్సార్ పార్టీ నాయకులు, ప్రతిష్టాత్మకంగా, గడపగడపకు, చేపట్టిన కార్యక్రమంలో, మండలంలోని పలు గ్రామాలు సందర్శించినప్పటికీ, మఠం భీమవరం పంచాయతీ సందర్శించకపోవడం దురదృష్టకరంగా పంచాయతీ వాసులు భావిస్తున్నారు. వేసవి సెలవుల కాలంలోనైనా నాడు నేడు పనులు పూర్తి చేసి విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు,గ్రామస్తులు కోరుకుంటున్నారు.