సంస్కృతి

గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన నరసింహుడు

మంగళగిరి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): మంగళగిరి పట్టణంలో వేంచేయున్న శ్రీ లక్ష్మీ నృశింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆస్థాన అలంకారాల్లో భాగంగా స్వామి వారు గోవర్ధనొద్దరణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ముఖ మండపంలో నిర్వహించిన ఈ అలంకారానికి కైంకర్యపరులుగా శనగల రామహానుమాన్, సేశాంజనీయ గోపాల్ వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు.

ఆలయ కార్యనిర్వాహణాదికారి మండేపూడిపానకాల రావు, ట్రస్టు బోర్డు సభ్యులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం గజేంద్రమోక్షం అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.