మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళ్లు అర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ.
న్యూడిల్లీ : తెలుగుజాతి గర్వించదగ్గ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దివంగత నేతకు ఘనంగా నివాళ్లు అర్పించారు.భారతదేశ రాజకీయాలపై పట్టుతో పాటు పాశ్చాత్య ఆలోచనల్లో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు.చరిత్ర, సాహిత్యం, విజ్ఞానశాస్త్రంలో ఆయనకు చాలా ఆసక్తి అని పేర్కొన్నారు.భారతదేశపు అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరైన పీవీకి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.సంక్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించిన పీవీ గొప్ప రాజకీయనేతే కాకుండా మహా పండితుడని అన్నారు…