ఆహారంజిల్లాలు

పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి-ప్రభుత్వ భూముల విక్రయం ఆపాలి.

నర్సీపట్నం : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా కరెంటు ఛార్జీలు పెంపు మరియు ప్రభుత్వ భూముల విక్రయం జి.ఓ లను తక్షణం రద్దు చేయాలని నర్సీపట్నం పట్టణం బి.జే.పి అధ్యక్షులు యడ్ల గణేష్ ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎడ్ల గణేష్ మాట్లాడుతూ పెంచిన కరెంటు చార్జీలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ వేలం ద్వారా ప్రభుత్వ భూములను చౌకగా తమ అనుచర వర్గాలకు దక్కేలా ఏర్పాటుచేసిన ఈఅమ్మకాల ప్రక్రియపై ఇచ్చిన జీవోను రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడాలని లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సహాయం ఒక చేత్తో వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు ఇచ్చి మద్యం అమ్మకాలు పేరుతో మరో చేత్తో  లాక్కుంటుందని ఇదెక్కడి ప్రభుత్వ విధానం అని ప్రశ్నించారు.ఓబీసీ మోర్చా నాయకులు వెంకటేశ్వరరావు యాదవ్( బాబా) మాట్లాడుతూ గతంలో వచ్చిన కరెంటు బిల్లులు ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులకు  పొంతన లేకుండా పోయిందని,గత మార్చి నెలలో బిల్లు 400 వచ్చింది మరి ఏప్రిల్ నాటికి అదే బిల్లు 3500 రూ..లుకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. గొలుగొండ మండల నాయకులు పల్లా రమణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని కరోనా వలన గ్రామీణవ్యవస్థ అభివృద్ధికి ప్రణాళిక లేకపోవడమే ఉదాహరణన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఐ.సంతోష్, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతల బుచ్చిరాజు, చిన్నికృష్ణ,పృద్వి పండు తదితరులు పాల్గొన్నారు…