ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్ప్రాంతీయంమ‌న ఆరోగ్యం

నర్సీపట్నం ప్రాంత ప్రజలకు అందుబాటులోకి ఎంఆర్ఐ స్కాన్

ఎం ఆర్ ఐ స్కాన్ ను ప్రారంభించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అబ్బాయి.

నర్సీపట్నం, కోస్తా టైమ్స్, ( జనవరి 29) : స్థానిక శ్రీకర్ స్కాన్ అండ్ డయాగ్నసిస్ మెడికల్ ల్యాబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో 1.5 టి. ఎం ఆర్ ఐ స్కాన్ ను నర్సీపట్నం ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆదివారం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అబ్బాయి అత్యాధునికమైన ఎం.ఆర్.ఐ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలోనే ప్రప్రథమంగా ఈ అత్యాధునిక స్కాన్ సెంటర్ ను నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్బాయి మాట్లాడుతూ, నర్సీపట్నంలో ఎంతోమంది నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ముఖ్యమైన ఎం ఆర్ ఐ స్కాన్ అందుబాటులో లేకపోవడంవల్ల,పేషంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖపట్నం వెళ్లి స్కాన్ చేయించుకోవలసి వచ్చేదని, ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న పేషంట్ కు సమయం వృధా అవ్వడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది అన్నారు.ఇప్పుడైతే ఎమ్మార్ఐ స్కాన్ నర్సీపట్నంలో అందుబాటులోకి రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. నర్సీపట్నం చరిత్రలో ఇది ఒక వైద్య విప్లవమని, నర్సీపట్నంలో స్థానికంగానే మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలు కలిగిందన్నారు. స్కాన్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ మహేష్ మాట్లాడుతూ, నర్సీపట్నం పరిసర ప్రాంత పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోనే సేవలందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, చింతకాయల రాజేష్, జడ్పిటిసి సుకల రమణమ్మ, పీసీసీ సభ్యుడు మీసాల సుబ్బన్న, సీనియర్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, కార్యక్రమ సంధానకర్త డాక్టర్ అధికారి గోపాలరావు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కృష్ణ సుమంత్, తదితరులు పాల్గొన్నారు…