జిల్లాలునేరాలు .. ఘోరాలురాష్ట్రీయం

అక్రమంగా త‌ర‌లిస్తున్న 110 కేజీలు గంజాయి స్వాదీనం.

నర్సీపట్నం రూర‌ల్ : సీలేరు గ్రామం నుంచి 110 కేజీలు గంజాయిని అక్ర‌మంగా AP39 TH 8062 నెంబర్ గల కారులో తెస్తుండ‌గా నర్సీపట్నం రూరల్ పోలీస్ సిబ్బంది గబ్బాడ‌ గ్రామం వద్ద కారుతో పాటు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన చెల్లంగి శ్రీనివాస రావు గాజువాక ప్రాంతం నుంచి ఒబర్ టాక్సీ కంపెనీ లో డ్రైవర్ గా చేస్తూ , ఆప్టింగ్ డ్రైవర్ గా ఎక్కి సీలేరు ప్రయాణీకులను దించడం కోసం వచ్చి పాత పరిచయం ఉన్నా గోపాల్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందని, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అక్ర‌మం‌గా గంజాయిని నర్సీపట్నం వరకు తరలించేందుకు 6000 రుపాయలుకు ఒప్పందం ఏర్పరచుకొని నర్సీపట్నం తెస్తుండగా రూరల్ ఎస్ఐ రవి కారు త‌నికీ చేయ‌గా అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని ఆయ‌న తెలిపారు…