ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్ప్రాంతీయంస్థానికం

నర్సీపట్నంలో జిల్లా వ్యాప్తంగా ఐ.టి.ఐ.ల అడ్మిషన్లు

* ఐటిఐ ప్రిన్సిపాల్,జిల్లా కన్వీనర్
పి.పరమేశ్వరరావు.
* ఈ నెల 16 వ తేదీ నుండి 18 సాయింత్రం వరకూ.

నర్సీపట్నం : ఆగష్టు,2022-2023-2024 విద్య సంవత్సరం నకు అనకాపల్లి జిల్లాలోని  రెండు ప్రభుత్వ ఐ.టి.ఐ.లు , ఇరవై తొమ్మిది ప్రైవేట్ ఐ.టి.ఐ.ల  నందు గల వివిధ ట్రేడ్ లకు తేదీ: 16-07-2022 శనివారం ఉదయం 08-00  గంటల నుండి  తేదీ: 18-07-2022 మంగళవారం సాయంత్రం 05-00 గంటల వరకు ప్రభుత్వ ఐ.టి.ఐ. నర్సీపట్నం నందు అడ్మిషన్స్ జరుగునని ఐటిఐ ప్రిన్సిపాల్,జిల్లా కన్వీనర్ పి. పరమేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకొనిన అభర్ధులు పదవ తరగతిలో సాధించిన మార్కులను అనుసరించి రూపొందించబడిన వారి వారి మెరిట్ ప్రకారం ఈ క్రింది తెలిపిన తేదీలలో ఆ రోజు ఉదయం 08-00గంటలకు ఒరిజినల్ ఎస్.ఎస్.సి. మార్క్స్ లిస్ట్, టి.సి., స్టడీ, ఆధార్, క్యాస్ట్, ఇన్ కమ్,ఈ.డబ్ల్యు.ఎస్. సర్టిఫికెట్స్,రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు మరియు రెండు సెట్ల జెరాక్స్ కాపీలతో ప్రభుత్వ ఐ.టి.ఐ. నర్సీపట్నం నందు హాజరు కావలెను అని తెలిపారు. ఎస్.సి./ఎస్.టిలకు అడ్మిషన్ పీజు మినహాయింపు వర్తిస్తుందన్నారు.నర్సీపట్నం ప్రభుత్వ ఐ.టి.ఐ నందు ఇరవై  శాతం ఐ.ఎం.సి. (మేనేజ్మెంట్)  కోటా సీట్లు కలవు.ఈ ఐ.ఎం.సి. (మేనేజ్మెంట్)  కోటాకు ఎంపిక కాబడిన అభర్ధులు కులంతో సంబంధము లేకుండా ఒక సంవత్సరం కోర్స్ కు రూ.10,000/-లు,రెండవ సంవత్సరముల కోర్స్ కు రూ.20,000/-లు అడ్మిషన్ పొందిన వెంటనే చెల్లించవలసి ఉంటుందన్నారు…