జిల్లాలున్యూస్ప్రాంతీయంరాజకీయంస్థానికం

నిరుపేదకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం రాజశేఖర్ రెడ్డి చలవే.


సీనియర్ రాజకీయ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు.

నర్సీపట్నం, కోస్తాటైమ్స్,(జూలై 8) : ప్రస్తుత కాలంలో నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందుతున్నదంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అని సీనియర్ రాజకీయ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా స్థానిక కాపు వీధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి సన్యాసి పాత్రుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ,ఒక రాజకీయ కుటుంబంగా తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఇద్దరు నేతలే గుర్తుకు వస్తారని, వారిలో ఒకరు వైయస్ రాజశేఖర్ రెడ్డి, మరొకరు ఎన్టీ రామారావు అన్నారు.రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే దానికి కారణం ఆయన పాలనలో పేద ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యంగా మూడు కార్యక్రమాలను అమలుపరిచారన్నారు. ప్రతి ఇంటిలో ఆరోగ్యం ఉండాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం,ప్రతి ఇంటిలో విద్యావంతులు ఉండాలని ఫీజు రీయింబర్స్మెంట్ పక్కాగా అమలు చేశారన్నారు. ప్రభుత్వంలోకి రాగానే ముఖ్యంగా ఆయనకిష్టమైన వ్యవసాయంపై దృష్టిపెట్టారని ఆయన పరిపాలన కాలంలో రైతులు సుభిక్షంగా వెలుగొందారన్నారు. ఆయన మన మధ్య లేకున్నా,ఈ పుడమి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డాక్టర్ రాజశేఖర్,డాక్టర్ లక్ష్మీకాంత్ రాజశేఖర్ రెడ్డి తో తమకున్న అనుబంధాన్ని వివరించారు.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చాలని డాక్టర్ లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి,వైయస్సార్ నాయకులు దాడి బుజ్జి,మామిడి శ్రీను,లాలం చిన అప్పారావు, చింతకాయల వరుణ్, కర్రి రామ్ గోపాల్ ,కన్నా,నక్కా శ్రీను,తదితరులు పాల్గొన్నారు…