ఆహారంప్రాంతీయం

ప్రజలెవరూ భయపడవలసిన పనిలేదు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్

నర్సిపట్నం: మున్సిపాలిటీ కార్యాలయంలో రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లు తో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి,
పట్టణ సి ఐ స్వామి నాయుడు పాల్గొని పలు విషయాలపై చర్చించారు.

ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రతి ఇంటికి సరుకులు వార్డు వాలంటరీ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుందని ఎంఎల్ఏ అన్నారు.

ఈ నెల 16 వ తారీఖున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకం ద్వారా వార్డు ప్రజలకు వాలంటీర్లు ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని సమావేశంలో తెలిపారు.

ఈ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వార్డు వాలంటీర్లు గిరి, రాము , ప్రవీణ్, హారిక , వెంకట లక్ష్మి ల సేవలు గుర్తించి అభినందించారు…