న్యూస్ప్రాంతీయంరాజకీయంవిశాఖపట్నం

పంచకర్ల,గంటాలను కలసిన నర్సీపట్నం జనసేన ప్రతినిధులు

నర్సీపట్నం, కోస్తాటైమ్స్ (అక్టోబర్ -19) : విశాఖ ఉమ్మడి జిల్లా జనసేన గ్రామీణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పంచకర్ల రమేష్ బాబును మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును గురువారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు నియోజకవర్గ జనసేన నాయకులు తెలిపారు.గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, టిడిపితో జనసేన పొత్తు నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 129 పంచాయతీలను,పట్టణంలో ఉన్న 28 వార్డులలోనూ ఇరు పార్టీలు సమన్వయం చేసుకుంటూ 2024 ఎన్నికలలో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో నాయకులను కలిసి సూచనలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పలువురు నాయకులను కలవడం జరుగుతుందని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసైనికులు అందర్నీకలుపుకు వెళ్లాలని నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఊడి చక్రవర్తి, పంచాడ హరినాథ్, అల్లాడ సురేష్, మంగళ భాస్కర్, బళ్ల అశోక్, పాతాళ శివ, చిన్ని,మోపాడ చిరంజీవి, బంటు ప్రసాద్, బట్టు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.