ఆంధ్రప్రదేశ్న్యూస్రాష్ట్రీయంవిశాఖపట్నం

పాఠశాల బోధనలో నాణ్యత ఏది.?

న‌ర్సీపట్నం,కోస్తాటైమ్స్ : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పట్టణంలో పలు పాఠశాలలను తనిఖీ చేశారు.పాఠశాలలో ఉపాధ్యాయులు ఇప్పటివరకు కూడా విద్యార్థులకు బుక్స్ సరిగ్గా ఇవ్వటం లేదని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.ఏ నెలలో అవ్వాల్సిన సిలబస్ ఆ నెలలో అవ్వాలని సమయానుకూలంగా సిలబస్ ఇప్పటికీ పూర్తి కావడం లేదని ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఇదే విషయం చెప్పడం జరిగిందని,నేను ప్రతి జిల్లా తిరిగి నేరుగా టీచర్లకు చెప్పాలా అని ప్రశ్నించారు.కనీసం 25% కూడా పిల్లల లో చదువుతున్నట్లు కనపడలేదని 30 మంది పిల్లల్లో 24 మందికి వరకు పుస్తకాలు ఉపాధ్యాయులు తనిఖీలు చేయడం లేదని ఉపాధ్యాయులపై దుయ్యబట్టారు.డీఈవో, డిప్యూటీ డిఈవో, ఎంఈఓ సూపర్వైజర్లు ఉన్నప్పటికీ మరలా నేను మీతో మీటింగ్లు పెట్టాలాని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు తీరు 80% కూడా క్వాలిటీ విద్య కనిపించడం లేదని ఈ విధంగా మరల కనిపిస్తే ఉపేక్షించేది లేదని మనసా,వాచా, కర్మణా ఉద్యోగ నిర్వహణ చేయాలని ప్రతి సోమవారం బోధన పద్ధతులు పనులపై పరీక్షించాలని అన్నారు. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దని ఆయన అలాగే చెబుతారులే అని తప్పుగా అంచనా వేయొద్దని పేరుపేరునా అధికారిని నిలదీశారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాడు నేడు పనులపై జిల్లా వృత్తి విద్య అధికారి మురళీధర్ ను అడగ్గా నాడు నేడు పనులు నవంబర్ వరకే వివరాలు తెలియజేయడంతో తక్షణమే ప్రవీణ్ ప్రకాష్ జిల్లా అధికారులు మురళీధరకు చార్జ్ సీటు అందించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే నాడు నేడు పనులుపై సరైన సమాధానం లేకపోవడంతో ఏఈ రమణాజికి చార్జ్ సీటు ఇవ్వమని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే కాలేజీలు నాడు నేడు పనుల్లో వెనుకబడ్డాయని అన్నారు.ఆయ‌న వెంట‌ ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు విధ్యాశాఖ అధుకారులు పాల్గోన్నారు.