- పలువీధులలో పందులు సైర్యవిహరం.
నర్సీపట్నం : పారిశుధ్యలేమితో పట్టణ ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. ఒక ప్రక్క కరోనా వైరస్ విజ్రంభిస్తుండం పరిశుభ్రంగా ఉండవలసిన పరిసరాలు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లడంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక శాతం పన్నులు చెల్లిస్తున్న శారదానగర్, ప్రధాన తపాలా కార్యాలయం దగ్గర ఎల్.ఐ.సి కార్యాలయం, రామారావుపేట, గవరవీధి , కాపువీధి,ఎస్సీ కాలనీ అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోయి ఉండడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు నగరం పలువీధులలో పందులు స్వైర్యవిహరంకు అదుపే లేదు. డివిజన్ కేంద్రంలో చెత్త పేరుకొని దుర్గందం వెదజల్లడంతో అటుగా వస్తూ పోతూ ఉన్నఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పన్నులు రూపంలో కోట్ల రూపాయిలు ప్రజల నుండి రాబడుతున్న సైతం మున్సిపల్ అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆక్షేపన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధానమైన పారిశుద్ధ్య ప్రక్రియపై నిర్లక్ష్యం చేయడం విచారకరమని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికయినా నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకున్న పారిశుధ్య సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు …