స్థానికం

ప్రశాంతంగా చివరిదశ పంచాయతీ ఎన్నికలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోందని రాష్ర్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ అన్నారు. విశాఖ జిల్లా పర్యాటనలో భాగంగా ఆదివారం ఆయన ఇక్కడి పెందుర్తి మండలం సరిపల్లి పోలింగ్ కేంద్రాన్ని అకస్మక తనికి చేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటింగ్ సాతం ఉదయం 11 లోపు గణనీయంగా పెరగడం, వృద్దులు, వికలాంగులు, స్వచ్ఛందంగా ఓటు వేయడానికి రావడం చాలా అభినందించదగ్గ విషయం ఆని అన్నారు. ఆయనతో పాటు విశాఖ డీఐజీ కాంతారావు, నగర పోలిస్ కమిషనర్ మనీష్ కుమార్ సింహ, డీసీపీ ఐశ్వర్యం రస్తగి,వెస్ట్ ఎసీపీ శ్రీపాద్ తదితర పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.