రాష్ట్రీయం

‘సొంత నియోజకవర్గ ప్రజలే ఛీ కొట్టారు’

చిత్తూరు, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): నోరు తెరిస్తే అబద్ధాలు, మాయమాటలు చెప్పే చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని, సొంత నియోజకవర్గ ప్రజలే చంద్రబాబును ఛీ కొట్టారని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కుప్పంలో చంద్రబాబు అడ్రస్‌ గల్లంతయిందన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని, బాబును ప్రజలు మరిచిపోయారన్నారు.