ఆహారంరాజకీయం

పేద ప్రజల కోసం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న ప్రధానికి కృతజ్ఞతలు.

తిరుప‌తి: బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విలేఖ‌ర్ల‌తో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి ద్వారా నవంబర్ వరకు బియ్యం,పప్పులు 80 కోట్ల మందికి ఉచిత సరఫరాను బిజెపి స్వాగతిస్తుంది. పేద ప్రజల కోసం ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నామ‌న్నారు.104, 108 ఆంబులెన్స్ సర్వీసుల్ ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. 104, 108 ఆంబులెన్స్ సర్వీసుల్లో గత ప్రభుత్వం మరియు ఇప్పటి ప్రభుత్వ ధరలలో వ్యత్యాసంపై అనుమానాలు తీర్చాలన్నారు.. కేంద్ర సహకారాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరని ప్ర‌శ్నించారు.కేంద్ర ఫతకాలకు ఎన్నిరోజులు స్టిక్కర్లు మారుస్తారని పేర్కోన్నారు.? రాష్ట్రంలో బిజెపి జాతీయ నేతలు ఇతర మంత్రులు ఇచ్చే సూచనలు,సలహాలు స్వాగతించే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదని విమ‌ర్శించారు. రాజకీయ విమర్శలతో బిజేపి కేంద్రమంత్రుల మీద సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల విషయంలో కరోనాకు ముందు కరోనా తర్వాత ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా ? అని ప్ర‌శించారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాల‌న్నారు. ఆంబులెన్స్ కొనుగోళ్ళపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. వైసిపి రంగుల పార్టీగా నిలిచిపోతుందని, ప్రజలజీవితాలలో రంగులు నింపాలి. గోడలమీద, వాహనాల మీద కాదన్నారు. ఎపి ప్రభుత్వం చెప్పేదానికి ..చేసే దానికి పొంతనే లేదని,ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ సిపి పార్టీల చర్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రాంతీయ పార్టీల పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ,తెలుగుదేశం ,వైఎస్ఆర్ సిపి రెండు పార్టీలు లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజాసంక్షేమం కంటే రాజకీయమే ముఖ్యమని ప్రవర్తిస్తున్నారన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నడో ప్రజా విశ్వాసం కోల్పోయన్నారు. కమ్యూనిస్టు నేతలుకేంద్రం ప్రభుత్వం మీద తమ ఉనికి కోసం విమర్శలకు దిగుతున్నారని వీరిని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం మాని వేసార‌న్నారు. కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీలుగా మారిపోయిన విషయం గుర్తుపెట్టుకోవాలి హిత‌వు చెప్పారు.