ఆంధ్రప్రదేశ్నేరాలు .. ఘోరాలుప్రాంతీయంరాష్ట్రీయం

పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి.

6 గురు మృతి12 మంది తీవ్రగాయాలు.

అమరావతి:- ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నూజివీడు నియోజకవర్గం లోని అక్కిరెడ్డి గూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరం అని అన్నారు. ఇప్పటికే 6 గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రం గా గాయపడడం పై అవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదు అన్నారు. ప్రభుత్వం సైతం నిత్యం తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు పని చెయ్యాలని చంద్రబాబు అన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని…బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.