న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరించాలని, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సవరించిన రూ.55,656 కోట్ల అంచనా వ్యయాన్ని ఎప్పటిలోగా ఆమోదిస్తారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని వైయస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పోలవరం నిధులపై రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. 2022 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని, నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. 2017 లెక్కల ప్రకారం రివైజ్డ్ కాస్ట్‌కమిటీ అంచనాలను తయారు చేసిందని, కమిటీ అంచనాలను పరిశీలించి కేబినెట్ నిర్ణయానికి పంపుతామన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకెళ్తామని చెప్పారు.