జాతీయంనేరాలు .. ఘోరాలు

కోరాపుట్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): ఒడిశాలోని కోరాపుట్ వద్ద జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘ఒడిశాలోని కొరాపుట్ వద్ద జరిగిన విషాద ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితోనే నా ఆలోచనలు ఉన్నాయి.’ అని ట్వీట్‌లో ప్రధాని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకుంటారని తాను ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్య పడాల్సిందేమీ లేదని బాధితులను ఓదార్చారు.