ఆహారంప్రాంతీయం

కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ప్రైవేట్ పాఠశాలలు తెరవద్దు.

నర్సీపట్నం : కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ప్రైవేట్ పాఠశాలలు తెరవద్దని విశాఖ రూరల్ అన్ ఎయిడెడ్ రికగ్నైజేషన్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గజపతిరాజు బంగారాజు కోరారు. గురువారం స్థానిక కృష్ణ పాలస్ ఆవరణలో  జరిగిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షులు ఫెన్విక్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.ఓ నెం:1 పాఠశాల విద్య ననుసరించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్కూల్స్ తెరవవద్దన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కరోనా ఉదృతి సమయంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం స్కూల్ వద్ద పుస్తకాలు అమ్మకాలు చేయడం చేయవద్దన్నారు. స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీసం సగం జీతం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. తగిన ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకుండా స్కూల్ బస్సులు తిప్పవద్దని కోరారు. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసే తల్లిదండ్రులు, విద్యార్థులపై వత్తిడి చేయవద్దన్నారు.కరోనా తీవ్ర దశలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం మంచిది కాదని డివిజనల్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు E.గోవింద్, కార్యదర్శి రామ్ ప్రసాద్, కోశాధికారి హరినాథ్, సునీత వివిధ మండలాల స్కూల్స్ కరస్పాండెంట్లు పాల్గొన్నారు…