జాతీయం

ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహం కిందకు స్పెషాలిటీ స్టీల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): స్పెషాలిటీ స్టీల్‌ను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహం (పీఎల్‌ఐ) పథకంలోకి కేంద్ర ప్రభుత్వం చేర్చింది. పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన, ఉక్కు రంగంలో సాంకేతికతను పెంచడం ద్వారా దేశంలో స్పెషాలిటీ స్టీల్ తయారీని ప్రోత్సహించడానికి ఐదేళ్లకు రూ.6322 కోట్లను కేటాయించింది.

దేశీయ అవసరాలను తీర్చడంలో భారత్‌ను స్వయంసమృద్ధిగా మార్చడం ద్వారా, దేశంలో స్పెషాలిటీ స్టీల్‌ లభ్యతను ఇది మెరుగుపరుస్తుంది. నియంత్రణ లేని బహిరంగ మార్కెట్ దృష్ట్యా; డిమాండ్, సరఫరా మార్కెట్ శక్తుల ద్వారా దేశీయ ఉక్కు ధర నిర్ణయమవుతోంది. ముడి పదార్థాల ధరల హెచ్చుతగ్గులు, ప్రపంచ ఉక్కు వ్యాపార పరిస్థితుల వల్ల కూడా ధర ప్రభావితమవుతోంది.