పట్ల ప్రజా సంఘాల రాస్తారోకో

గుంటూరు, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ అమరావతి పరిధి ప్రజా సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. నిడమర్రులో జరిగిన ఈ నిరసనకు వివిధ రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలిపాయి. పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటికరించకూడదునీ నిరసనకారులు డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని డి.వై.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షుడు సుందరయ్య పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదని అంటున్న నరేంద్ర మోడీ మరి ఉద్యోగాల కల్పన ప్రభుత్వం పని కాదా?? అని ప్రశ్నించారు.

‘‘నిత్యావసర ధరలు పెరుగుకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం పని కాదా?? రాష్ట్రానికి ఇవ్వవలసిన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఉన్న విశాఖ ఉక్కును ప్రయివేట్ కంపెనీలకు కారు చౌకగా అమ్మాలనుకోవడం హేయమైన చర్య. ఇప్పటికే దేశ యువత నిరుద్యోగంతో సతమతమౌతుంటే బ్యాంకుల విలీనం, ప్రభుత్వ సంస్థల ముసివేతతో మరింత మంది ఉపాధి కోల్పోతారు.’’ అని సి.ఐ.టి.యూ. రాజధాని కార్యదర్శి యం. భాగ్యరాజ్ అన్నారు.

‘‘విశాఖ ఉక్కు ప్రయివేటికరిస్తే సుమారు 40,000 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. పరోక్షంగా ఉపాధి పొందుతూన్న లక్ష మంది పని కోల్పోతారు కాబట్టి కేంద్రం ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి ఆదు కోవాలి.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాజధాని అధ్యక్షుడు కట్టిపోగు ప్రకాష్ రావు, కుంపటి ఈరయ్య, నందిగాం రవి, సిరిబాబు, సాంబయ్య, నాగరాజు, మనోజ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News