ఆహారంస్థానికం

రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం.

అమరావతి : ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం సాధించారు.ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,  మోపిదేవి వెంకటరమణ,పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు.రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరిగింది.రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండగా.. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌,మంత్రి మోపిదేవి వెంకట రమణారావు,రాంకీ గ్రూప్ అయోధ్యరామిరెడ్డి,రిలయర్స్‌ గ్రూపునకు చెందిన పరిమళ్‌ నత్వానీ పోటీ చేశారు.టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు.పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభయింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది.సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కించారు.ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు…