ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్ప్రాంతీయంరాజకీయం

రక్షిత మంచినీటి పథకాన్నిప్రారంభించిన అరకు ఎంపీ మాధవి

కొయ్యూరు, కోస్తాటైమ్స్  : మండలంలోని వెలగల పాలెం లో రక్షిత మంచినీటి పధకాన్ని అరకు ఎంపీ గొట్టేటి మాధవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలలో ముఖ్యంగా ఊటగెడ్డల నీటిని త్రాగునీటిగా వినియోగించడం వల్ల గిరిజనులు అనేక వ్యాధుల బారిన పడుతూ ఉండేవారని, సురక్షితమైన రక్షిత మంచినీటి వినియోగం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ఆమె అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మండలాలలో రక్షిత మంచినీటి కల్పన కోసం ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జనజీవన మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ ప్రసాద్, కొయ్యూరు మండల జెడ్ పి టి సి వారా నూకరాజు, శరభన్నపాలెం సర్పంచ్ కిముడు సత్యనారాయణ, వెలగల పాలెం సర్పంచ్ ఇరువాడ రత్నకుమారి, డౌనూరు ఎం పి టి సి బిడిజాన అప్పారావు, గొలుగొండ వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, యువ నాయకుడు గొట్టేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు…