మ‌న ఆరోగ్యంరాష్ట్రీయంస్థానికం

రణపాల మొక్క మీ ఇంట్లో ఉంటే పెద్ద డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే.

సాధారణంగా ఒక మొక్క రెండు నుంచి మూడు రోగాలు నయం చేస్తుంది. మహా అయితే ఇంకొన్ని రోగాలను నయం చేస్తుందని చెబుతుంటారు నిపుణులు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక మొక్క గురించి వింటే మాత్రం తప్పకుండా షాకవ్వాల్సిందే. ఈ మొక్క యొక్క ఆకులు,వేర్లు, కాండం ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. ఇంతకీ ఆ మొక్క ఏమిటో? ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. మొక్క ఏదో కాదండి రణపాల మొక్క.రణపాల మొక్క ను ముఖ్యంగా పెరట్లో పెంచుకుంటారు. చాలామంది. రణపాల మొక్క లో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు,తలనొప్పి, గడ్డలు, వాపు వంటి ఎన్నో రకాల రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క ఆకుల నుండి తయారైన టీ ని తిమ్మిరి, ఉబ్బసం తోపాటు సైనస్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ టీ ని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను వదిలించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఏ జబ్బుకు ఈ మొక్కను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
మూత్రాశయ సమస్య:
మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఐదు మిల్లీలీటర్ల రసం తాగాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
రక్తపోటు:
రణపాల మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కల వరకు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు:
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి రోజుకు రెండుసార్లు 40 నుంచి 50 మిల్లీ లీటర్ల కషాయాన్ని తాగాలి.ఇలా చేయడం వల్ల కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి
కంటి నొప్పి:
రణపాల ఆకు రసాన్ని కళ్ల చుట్టూ పలుచటి లేపనంగా రాయడం వల్ల కంటి నొప్పుల నుంచి బయటపడవచ్చు.
గాయాలకు చికిత్స:
ఏదైనా గాయం తగిలినప్పుడు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానిపోతుంది.
తలనొప్పి:
రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది.
యోని రుగ్మతలు:
స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వారికి రెండు గ్రాముల తేనె ను 40 నుంచి 60 మిల్లీ లీటర్ల కషాయం లో కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
రక్త విరేచనాలను నయం చేస్తుంది:
మనలో కొంతమందికి రక్త విరేచనాలు అవుతుంటాయి. ఇందుకోసం మూడు నుంచి ఆరు గ్రాముల రణపాల ఆకుల రసానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి అంతే రెట్టింపు స్థాయిలో నెయ్యి కలపాలి.దీన్ని బాగా నూరి రోగికి రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు తగ్గుతాయి.
పైల్స్:
రణపాల ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల పైల్స్ నుంచి విముక్తి కలుగుతుంది.
కాలేయ సమస్యలు:
రణపాల ఆకులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కామెర్లు ఉన్నవారు కూడా దీన్ని వాడటం వల్ల వేగంగా తగ్గించుకోవచ్చు.
అంతే కాకుండా కడుపు నొప్పి, పేగులలో నులిపురుగులు, మధుమేహం,మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.అంతేకాకుండా చర్మం మీద పుండ్లు,బెణుకులు, పురుగులు కుట్టడం వంటి ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో మొదటి పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ల కారణంగా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకు ఉంది…