ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్రాజకీయంవిశాఖపట్నం

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ బుజ్జగింపు ధోరణి విడనాడాలి. బిజెపి డిమాండ్.

నర్సీపట్నం బీజేపీ శ్రేణులు ఆధ్వర్యంలో నిరసన ధర్నా.

కర్నూలు బిజెపి జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.

నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై మతత్వ వాదులు  జరిపిన దాడులను నిరసిస్తూ స్థానిక నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు కాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిరసన ధర్నా చేపట్టారు.బి.జె.పి జిల్లా ఇంచార్జీ ఎస్.వి.ఎస్. ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో మతతత్వ దాడులను అరికట్టాలని శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడమే కాకుండా వారి యొక్క వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వారిపై హత్యా ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి వారిని వెంటనే  పోలీస్ శాఖ గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయవలసింది పోయి దానికి వ్యతిరేకంగా కనీసం ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షులుపై జరిగిన దాడులను పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే విడుదల చేయాలని  భారతీయ జనతా పార్టీ శ్రేణులపై కార్యకర్తలపై దాడులు భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది.ఈ కార్యక్రమంలో  భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శలు పరమేశ్వర రావు,నాగేశ్వరావు,రాష్ట్ర సంపర్క అబియాన్ ప్రముఖ్ గాదె శ్రీనివాసరావు,కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.భక్త సాయిరాం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు స్వరూప్, అడిగర్ల సతీష్, పృథ్వీరాజ్, బిజెపి ఒ.బి.సి మోర్చా వెంకటేశ్వర యాదవ్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు ఎ.కొండబాబు, సీనియర్ నాయకులు బంగారు ఎర్రినాయుడు, నూకేశ్వరావు,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవిలత,జిల్లా నాయకులు రామకృష్ణ, కామేశ్వరరావు, నాలుగు మండలాల అధ్యక్షులు గవిరెడ్డి రఘు చక్రవర్తి, లాలం వెంకట రమణారావు,వెలగా జగన్నాద్,గుమ్మడి గణేష్, కోటవుర్లట ,కశింకోట  మండలాల అధ్యక్షులు కరక సత్యనారాయణ, కనకరాజు, జిల్లా నాయకులు,ప్రసాద్, నాయుడు,గోవిందు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…