రాష్ట్రీయం

మంత్రి కొడాలి నానిపై తొల‌గిన ఆంక్ష‌లు

అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. కొడాలి నానిపై ఎస్‌ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పథకాల గురించి మీడియాతో కొడాలి నాని మాట్లాడవచ్చని పేర్కొంది. అయితే, ఎన్నికల కమిషన్‌, ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే విధంగా కొడాలి నాని మాట్లాడకూడదని హైకోర్టు సూచించింది.