ఆంధ్రప్రదేశ్గ్రామీణంజిల్లాలున్యూస్ప్రాంతీయం

రోడ్డు నిర్మాణానికై ఎమ్మెల్యేకు జర్నలిస్టుల వినతి

నర్సీపట్నం, కోస్తా టైమ్స్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని జోగినాథుని పాలెం సమీపంలో పాత్రికేయులకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, కానీ రోడ్డు నిర్మాణానికి ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, రోడ్డు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని నర్సీపట్నానికి చెందిన పాత్రికేయులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు వినతి పత్రం అందించారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతామని పాత్రికేయులకు హామీ ఇచ్చి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా ఈ విషయమై నర్సీపట్నం పాత్రికేయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.