ఆహారంజిల్లాలురాష్ట్రీయం

చారిత్ర‌త్మ‌క‌ స‌‌బ్ క‌లెక్ట‌ర్ బంగ్లా రిపేర్ల పేరుతో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న త‌గ‌దు.


నర్సీపట్నం: చారిత్ర‌త్మ‌క‌ స‌‌బ్ క‌లెక్ట‌ర్ బంగ్లాలో ఉండకుండానే బంగ్లా శిధిలావస్థలో ఉంది అని ఎలా అంటున్నారని . సబ్ కలెక్టర్ నిన్నటి ప్రముఖ దినపత్రికలో బంగ్లా రిపేరుల గురించి వచ్చి వార్త చదివిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలు శిధిలావస్థలో ఉన్నట్టుగా మీకు ఏ ఇంజనీరింగ్ అధికారులు దృవపరిచారని సామాజిక కార్యకర్త పాకలపాటి అరవింద్ కుమార్ రాజు ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శ్నించారు. బంగ్లా మ‌రామ‌త్తుల నిమిత్తం గత ప్రభుత్వం నుండి ఇప్పటి ప్రభుత్వం వరకూ ఎన్ని సార్లు మరమ్మత్తులు నిమిత్తం ఎంత ఖర్చు చేసారో మీకు తెలుసా ? శిధిలావస్థలో ఉన్న బంగ్లాలో ఇప్పటి వరకూ నివాసం ఉన్నటు వంటి ఆర్.డి.ఓ లకు ఈ విషయం తెలియలేదా ? మరమ్మత్తులు ప్రభుత్వ భవనాలు ఆర్.అండ్.బి అధికారులు చేపట్టాలని కానీ హౌసింగ్ అధికారులు చేపడుతున్నారన్నారు. నిబంధనలు పాటించాల్సిన ఉన్నత అధికారిణిగా ఉండి నిబంధనలు తుంగలోకి తొక్కి సమర్థించు కోవడం ఎంత వరకు సమంజసమ‌న్నారు. ప్రజల కోరకు అధికారులు ఉన్నారా? అధికారుల కోసం ప్రజా ధనం దుర్వినియోగం చేసే హక్కు అధికారులకు ఉన్నాదా ? నిస్సిగ్గుగా బంగ్లా మరమ్మత్తు పేరుతో విలువైన టేకు చెట్లును నరికివేసిన‌ట్లు చెప్పటం హాస్యస్పద‌మ‌న్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రజల కోరకు స‌రియైన‌ ఒక్క ఉద్యానవనం కూడా లేదు కాని అధికార్ల కోసం స‌బ్ క‌లెక్ట‌ర్ బంగ్లాలో ఉద్యాన వనం అభివృద్ధి కొరకు నిధులు కేటాయింపు జరుపడమేమిట‌న్నారు. సామాన్య ప్రజానీకంకు ఒక నిభంద‌న‌ ఉన్నత అధికారులకు ఒక నిభంద‌న‌ రాజ్యాంగంలో కల్పించ బడలేదు అనే విషయం ఉన్నత అధికార్ల‌కు తెలియదని ప్రజలు భావించాలా? అటవీశాఖ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు.చెట్ల కొట్టివేత‌పై అనేక ఇబ్బందుల క‌లిగించే అట‌వీశాఖ అధికారుల‌కు ఇది క‌నిపించ‌లేదా అని విమ‌ర్శించారు.సామాన్య ప్ర‌జ‌ల‌ను పై విషయాలు అన్నిటిపై విచారణ చేసి వాస్తవాలు బయట పెట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తుర‌న్నార‌ని తెలిపారు.