ఆహారంస్థానికం

కరోనా వైరస్ వల్ల చనిపోయిన వ్యక్తిని జె.సి.బితో తీసుకుని వెళ్లడం దారుణం.

విశాఖపట్నం: శ్రీకాకుళం లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన వ్యక్తిని జె.సి.బి.బకెట్ లో పెట్టి స్మశానవాటికకు తీసుకుని వెళ్లడం అత్యంత హేయ‌మైన చర్య ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌బ‌ద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాద‌వ్ పేర్కోన్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ సంఘ‌ట‌న‌కు భాద్యులైన అధికారులును క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌నతో స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకోవాల‌న్నారు. పలాసలో కరోనాతో చనిపోయిన ఒక మహిళను కూడా మునిసిపల్ చెత్త తీసుకుని వెళ్లే ట్రాక్టర్ లో వేసి స్మశానవాటికకు తీసుకుని వెళ్లిన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా జిల్లాలోని ప్రభుత్వ అంబులెన్స్ సర్వీసులు ఎందుకు ఉపయోగించలేదని దీనిపై కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం, ఆరోగ్య శాఖాధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.