ఆంధ్రప్రదేశ్న్యూస్రాష్ట్రీయంసంస్కృతి

సింహ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు.

ఒంటిమిట్ట‌ : శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు సింహ వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా,మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

           సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి.సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది.అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్,ఏఈఓ శ్రీసుబ్రహ్మణ్యం,సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు…