ఆహారంరాష్ట్రీయంసంస్కృతి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలను ప్రకటించిన టీటీడీ.

తిరుమల : శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణ మండపంలో వాహనసేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది . బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన 16వ తేదీ ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం రాత్రి 7 నుంచి 8 వరకు పెద్దశేష వాహనసేవ 20వ తేదీ రాత్రి 7 నుంచి గరుడసేవ జరగనుంది. 21వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు వసంతోత్సవ ఆస్థానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు కల్యాణ మండపంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు.23వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనసేవ ఉంటుంది. 24వ తేదీ ఉదయం 6 నుంచి 9 వరకు ఆలయంలోని అద్దాల మండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. విజయదశమి రోజైన 25వ తేదీన పార్వేట ఉత్సవాన్ని ఏకాంతంగా జరుపుతారు.ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీమలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు…పార్వేట ఉత్సవం అనంతరం స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు’ అని టీటీడీ వెల్లడించింది..*

వాహన సేవల వివరాలు:

◆16-10-2020: బంగారు తిరుచ్చి ఉత్సవం(ఉదయం 9 గంటలకు)
పెద్దశేష వాహనం(రాత్రి 7 గంటలకు)

◆17-10-2020: చిన్నశేష వాహనం (ఉదయం 8 గంటలకు)
హంస వాహనం(రాత్రి 7 గంటలకు)

◆18-10-2020: సింహ వాహనం(ఉదయం 8 గంటలకు)
ముత్యపుపందిరి వాహనం (రాత్రి 7 గంటలకు)

◆19-10-2020: కల్పవక్ష వాహనం (ఉదయం 8 గంటలకు)
సర్వభూపాల వాహనం(రాత్రి 7 గంటలకు)

◆20-10-2020: మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు)
గరుడసేవ(రాత్రి 7 గంటలకు)

◆21.10.2020: హనుమంత వాహనం (ఉదయం 8 గంటలకు)
పుష్పకవిమానం(మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు)
గజ వాహనం(రాత్రి 7 గంటలకు)

◆22-10-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం 8 గంటలకు)
చంద్రప్రభ వాహనం(రాత్రి 7 గంటలకు)

◆23-10-2020: సర్వ భూపాల వాహనం(ఉదయం 8 గంటలకు)
అశ్వ వాహనం(రాత్రి 7 గంటలకు)

◆24-10-2020: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం(తెల్లవారుజామున 3 నుంచి 5 వరకు)
స్నపనతిరుమంజనం, చక్రస్నానం (ఉదయం 6 నుంచి 9 వరకు) బంగారు తిరుచ్చి ఉత్సవం(రాత్రి 7 గంటలకు)ముగింపు…