అమరావతి, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్): అక్కచెల్లెమ్మల మేలు కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో వినూత్న పథకాన్ని రూపొందించారు. ఈబీసీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ‘ఈబీసీ’ పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగులలోపు ఉంటే రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాలను క్యాలెండర్‌గా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. అదేవిధంగా ‘ఈబీసీ నేస్తం’ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.