ఆంధ్రప్రదేశ్నేరాలు .. ఘోరాలువిశాఖపట్నం

బీటెక్ విద్యార్ధిని రమ్యను హత్య చేసిన శశి కృష్ణను కఠినంగా శిక్షించాలి.

నర్పీపట్నం, ఆగ‌ష్ట్‌ -16 : ఐసిడియస్‌ కార్యలయం వద్ద,ఆఖీల బారత ప్రజాతంత్ర మహిళ మహిళ సంఘం (ఐద్వా), భారత విద్యార్థి పెడరేషన్‌ (SFI) ల ఆధ్వర్యంలో గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్యను హత్య చేసిన శశి కృష్ణ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది.సందర్భంగా విశాఖపట్నం జిల్లా ఐద్వా ఉపాద్యాక్షులు ఎల్‌. గౌరి మాట్లాడుతూ గుంటూరు జిల్లా బీటెక్ విద్యార్ధిని రమ్యను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన శశి కృష్ణను నిర్భయ, దిశ చట్టాలు అమాలు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళసంఘం ఐద్వా నాయకులు వి. సామ్రాజ్యం, జ్యోతి,ఎస్‌ఎప్‌ఐ నాయకులు బాలకృష్ణా,రామకృష్ణ, పాల్గొన్నారు…