జాతీయం

ప్రమాదాలపై సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ, జనవరి 30 (న్యూస్‌టైమ్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు, రవాణా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆటోల్లో పరిమితికి మించి (రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికీ ప్రమాద బీమా వర్తించదు. అదే విధంగా ప్రభత్వ పథకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా వర్తించదు. తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తికి కానీ ఏ విధమైన బీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తిపై ఎటువంటి కేసులు ఉండవు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన బీమా వర్తించదు. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి.

ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరాలు రద్దు చేస్తారు. ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరాలు తొలగిస్తారు, ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.

అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే ఏ విధమైన బీమా వర్తించదు.