జిల్లాలున్యూస్ప్రాంతీయంరాజకీయం

స్వర్గీయ అంకంరెడ్డి జమీల్ సంకల్పించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

*స్వర్గీయ అంకంరెడ్డి జమీల్ కుటుంబ సభ్యులను కలిసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.

నాతవరం,కోస్తాటైమ్స్ :  మండల కేంద్రం నాతవరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సెంట్రల్ భ్యాంక్ డైరెక్టర్ దివంగత నేత అంకంరెడ్డి జమీలు సంకల్పించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పూర్తి చేసి ఆయన ఆశయాన్ని నెరవేర్చవలసిన బాధ్యత అందరి పైన ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన స్వర్గీయ అంకంరెడ్డి జమీలు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈరూడి బాబు కొండపై నూతనంగా నిర్మించ తలపెట్టిన అతి పురాతనమైన, ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలగా మా ఇద్దరి మధ్య మంచి అవినాభావ బంధం ఉందని, రాజకీయంగానే కాకుండా కుటంబపరంగా కూడా నిత్యం సమస్యల పైన చర్చించుకునే వారిమని అన్నారు. మండల ప్రజలందరినీ ఒక కుటుంబంగా చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారని, అటువంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన మంచి నాయకున్ని ఈ ప్రాంతం కోల్పోయిందని, అటువంటి నాయకుడు లేని లోటు ఎవరు తీర్చలేరన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు…